తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని మూలవిరాట్టు గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు. దీనివెనుక ఉన్న వృత్తాంతం ఏమిటో మీకు తెలుసా??
అయితే ఈ కథనం చదవండి..
స్వామి అలంకరణ కోసం పుష్పనందన వనాన్ని పెంచాలని రామానుజాచార్యుల వారు తన శిష్యుడు అనంతాళ్వార్‌ను ఆదేశించారు.
ఈ పనిలో అనంతాళ్వార్ సతీమణి కూడా పాలుపంచుకుంది. గర్భవతిగా ఉన్న ఆమె.. తవ్విన మట్టిని గంపలో తీసుకెళుతూ అలసి కింద పడిపోతుంది. దీన్ని గుర్తించిన శ్రీనివాసుడు బాలుని రూపంలో ఆమెకు సాయపడతాడు…దైవకార్యంలో ఇతరులెవరూ జోక్యం చేసుకోకూడదంటూ ఆ బాలుడిని అనంతాళ్వార్ కొడతాడు.
గడ్డంపై దెబ్బ తగలడంతో బాలుడు అదృశ్యమై పోతాడు…తర్వాత అనంతాళ్వార్ ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటాడు… గడ్డంపై నుంచి రక్తం కారడం చూసిన అనంతాళ్వార్ ఆ బాలుడు శ్రీహరేనని గ్రహించి రక్తం కారకుండా పచ్చకర్పూరం పెడతాడు… అందుకే నేటికీ మూలవిరాట్ గడ్డం కింద పచ్చకర్పూరం పెడుతున్నారు.
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజూ పచ్చకర్పూర తిలకాన్ని పూజారులు పెడతారు. భక్తులు వెంకటేశ్వరునికి కానుకలు సమర్పిస్తే దేవాలయ అధికారులు భక్తులకు పచ్చ కర్పూరాన్ని పోస్టు ద్వారా అందజేస్తారు…
మరి ఈ పచ్చకర్పూరాన్ని ఎలా వినియోగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి..?
* స్వామివారి పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటికి పెట్టుకుంటే సాక్షాత్తు వెంకటేశ్వరస్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
* స్వామివారి ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పాలల్లో వేసుకుని తాగితే స్వామివారి ప్రసాదం సేవించినంత ఫలితం ఉంటుంది.
* స్వామివారి పచ్చకర్పూరాన్ని కుంకుమపువ్వు రెంటినీ కలిపి డబ్బుల డబ్బాలో పెట్టుకుంటే ధనలాభం కలుగుతుంది.
* వ్యాపారులు ప్రతిరోజూ స్వామివారి పచ్చకర్పూర కుంకుమను నుదుటికి పెట్టుకుంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
* స్వామివారి పచ్చకర్పూరంతో హోమం చేస్తే అన్నీ వశీకరణ అవుతాయి.
* స్వామివారి పచ్చకర్పూరాన్ని తీపి పదార్థాలతో కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే ఆ యింట శుభకార్యాలు త్వరగా జరుగుతాయి.
* స్వామివారి పచ్చకర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే రాజసన్మానం, సంఘంలో గౌరవమర్యాదలు లభిస్తాయి.
* స్వామివారి పచ్చకర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పనులూ శీఘ్రంగా జరుగుతాయి.
* స్వామివారి పచ్చకర్పూరం, పాలతో మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేసి ఆ పాలను తాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాలు నివృత్తి కలిగి సంతానం లేని వారికి సంతానం యోగం కలుగుతుంది.
* స్వామివారి పచ్చకర్పూరం కలిపిన నీటిని ప్రతిరోజూ తాగితే గ్యాస్ట్రిక్ సమస్య, దంతదుర్గంధం దరిచేరవు.
* స్వామివారి పచ్చకర్పూరాన్ని నీటిలో కలిపి ముక్కు, ఎద, నుదుటికి రాసుకుంటే తలనొప్పి, జలుబు నయమైపోతాయి.
* స్వామివారి పచ్చకర్పూరాన్ని కొబ్బరినూనెలో కలిపి తలకు పెట్టుకుంటే జుట్టు సుగంధమయం అవుతుంది..
Nithyaya niravadhyaya sathyananda chidhathmane…Sarva antharathmane srimad Venkateshava Mangalam
DISCLAIMER : Honestly, I cannot claim any ownership either to this article or to the information therein..A friend had send this info through mail and I reverentially believed it and sincerely thought it’s certainly worth sharing with my beloved readers..
However,my non Telugu speakers,need not worry..In the next week,am going to come up with an English version of this article..Until then please bear with me..
Love
Narrenaditya Komaragiri
narrenaditya@purple-dove-197856.hostingersite.com
To know more about the author please click here
